‘అమేజాన్’ లో అమేజింగ్ పుస్తకాలు

ఆంధ్ర‌భూమి దిన ప‌త్రికకు ఎడిట‌ర్ గా సుదీర్ఘ‌కాలం పాటు ప‌నిచేసిన ఎంవీఆర్ శాస్త్రి  గారు ఈ ప‌త్రిక‌లో వార్త‌ల విష‌యంలో తానొవ్వ‌క‌, ఇత‌రుల‌ను నొప్పించ‌క అనే రీతిలో  నడిపారు.  ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన శాస్త్రి గారు..సంఘీయుల భావ‌జాలంతో లెఫ్ట్ మీద కొంత దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డ‌మే త‌ప్ప ఇత‌ర విష‌యాల్లో ఎటువంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు క‌నిపించేవి కాదు. 
ఆయనకు పత్రికా జర్నలిజం పరంగా కన్నా ఆయన రాసిన పుస్తకాలకు వీరాభిమానలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. లోతైన విశ్లేషణ, సరళమైన భాష, పదునైన వ్యంగ్యం శాస్త్రి గారి సొంతంగా ఆయన రచనలు సాగేవి.  సనాతనధర్మ గురించి పోరాడే ఆయన విశ్రాంతి ఎరగని, భయం అంటే తెలియని యోధుడు. 

ఆయన రాసిన పుస్తకాలు చదివిన ఎవరైనా …వీర సావర్కర్ గారి రచనల తరువాత అంతగా ప్రభావితం చేసే రచనలు శాస్త్రి గారివి అని ఒప్పుకుంటారు.ఆధునిక భారత విశ్లేషాత్మక రచయితలలో శాస్త్రి గారి స్థానం చాలా ఉన్నతమైనది.ఆయన రచనలలోని తర్కబద్ధమైన విశ్లేషణ ఎంతోమందిని నిబద్దత కలిగిన జాతీయవాదులుగా మారుస్తుందనేది నిజం. ముఖ్యంగా చారిత్రక అంశాలతో ఆయన రాసే పుక్తకాల్లో భారతీయ ఆత్మ గోచరిస్తుంది.  శాస్త్రి గారి లాంటి వ్యక్తులు, ఆయన రాసిన పుస్తకాలు ఈ సమాజానికి అవసరం.ప్రతీ పౌరుడు ఆయన్ను, ఆయన రచనలను స్ఫూర్తిగా తీసుకొని చీడ పురుగుల్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఆయన రచనలు అన్నీ ఇప్పుడు అమెజాన్ లో లభ్యమవుతున్నాయి.