బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత

బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరైన బాలాంత్రపు రజనీ కాంత రావు గారు ఈ రోజు ఉదయమే విజయవాడలో తన కుమారుడి ఇంటిలో కాల ధర్మం చేసారు.

పశ్చిమగోదావరి జిల్లా నిడదోలులో రజనీకాంత రావు జన్మించిన ఈయన తొలితరం సంగీత దర్శకుల్లో బాలాంత్రపు ఒకరు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యులు.
తెలుగువారి ‘ధర్మ సందేహాలు’ ఉషశ్రీ ద్వారా నివృత్తి చేయించింది ఈయనే. కార్మికుల కార్యక్రమం, వనితా వాణి… ఏ కార్యక్రమమైనా దాని సిగ్నేచర్‌ ట్యూన్‌ ‘బాలాంత్రపు’ బాణీనే. కృష్ణశాసి్త్ర పాటలోని మాధుర్యమైనా, శ్రీశ్రీ రాసిన నాటికల రేడియో ప్రసారాలైనా, చలం ఇంటర్వ్యూ అయినా ఆయనకు మాత్రమే సాధ్యమనిపిస్తాయి.

లలిత సంగీతం, యక్షగానాలతో శ్రోతల అభిమానాన్ని సంపాదించారు. ఆయన భక్తిరంజని, ధర్మసందేహాలు వంటి కార్యక్రమాలతో అందరికి సుపరిచితుడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియోశ్రోతలను అలరించారు

రజనీగా ప్రసిద్ధులైన బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీతసారధ్యంలో వినవచ్చే మేలుకొలుపు, తరవాత రజని స్వయంగా రచించి, స్వరపరచి, రమణ మూర్తి, లక్షి గార్లు పాడిన సూర్య స్తుతి

ప్రతి ఆదివారం ఉదయం భక్తిరంజని లో వినిపించేది. “శ్రీ సూర్యనారాయణా మేలుకో”
అంటూ ఉదయిస్తున్న సూర్యుని వర్ణన నుంచి మొదలయ్యి అస్తమిస్తున్న సూర్యుని వర్ణన దాకా వివరణ ఉంటుంది. తొమ్మిది ఛాయలలో ఉండే సూర్యుని వర్ణన, ముఖ్యంగా ఒక్క రోజులో వివిధ దశల్లో కనిపించే సూర్యుని రంగులని వివిధ పుష్పచ్ఛాయలతో పోల్చటం అద్బుతంగా ఉంటుంది.

ఆ తరవాత సాగే స్తుతి రజని గొంతులో అత్యద్భుతంగా ఇలా సాగుతుంది.

“శ్రీ సూర్యనారాయణా
వేద పారాయణా
లోక రక్షామణీ
దైవ చూడామణీ

ఈ సూర్య స్తుతి భక్తి పూర్వకంగా వినిపించినా, కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే గత కొన్ని వందల సంవత్సరాలల్లో శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలు ఈ స్తుతిలో నిక్షిప్తమై ఉన్నాయి అని తెలుస్తుంది.

‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహో పావురమా..’ మొదలు రాజమకుటంలో ‘ఊరేది పేరేది..’ వరకు ఆయన సినీ పరిశ్రమకు అందించిన అద్బుతాలే.
ఆయన బాణీ కూర్చగా భానుమతి గారు పాడిన ” ఒహొహో పావురమా” పాట ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ చూడండి..