విశ్వనాధ్ వెంకట్ దాసరి నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి

రచయిత: విశ్వనాధ్ వెంకట్ దాసరిపుస్తకం: నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి (Nuggets Of Knowledge) తన దృష్టి లోపాన్నిఅధిగమించి ఇంగ్లీష్ రచనలు చేస్తున్న విశ్వనాధ్ వెంకట్ దాసరి తన మూడో పుస్తకాన్ని ఈరోజు గోకవరం లో విడుదల చేసారు. తన మొదటి రెండు పుస్తకాలు నవలలు కాగా ఈ పుస్తకం మన ప్రాచీన భారత దేశంలో ఉన్న మహాత్ముల గురించి, దేవాలయాల గురించి , లలితకళలు , ఆధ్యాత్మికత, రామాయణ మహాభారత సారం , ఆయుర్వేదం , వీరనారులు మహారాజుల గురించి తన దృష్టికోణంలో రచయిత కధానికల రూపంలో వ్రాయడం జరిగింది. దైవభక్తి డాట్ కామ్ అనే వెబ్ సైట్ కు కంటెంట్ రైటర్ గా ఇటీవల తాను అందించిన స్నిప్పెట్స్ ప్రేరణతో ఈపుస్తకాన్నీ రాయడం జరిగింది అన్నారు విశ్వనాధ్. దేహమే దేవాలయంగా, జీవమే దైవం గా కొలిచే ప్రాచీన భారతీయ సంస్కృతి, సాంకేతికంగా నిరూపితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్నిమరచి ఇప్పటి తరాలు అటు మేధస్సుకు ఇటు జ్ఞానానికి కాకుండా దారితప్పుతున్నారు. ఈ నేపధ్యంలో, మన యువతకు భారత దేశ అసలైన చెరిత్ర, మన దేవాలయాలు, ఋషులు, ఆళ్వారులు, నాయనార్లు, కాకతీయులు, రెడ్డిరాజులు విజయనగరరాజులు మొదలైన వారు మనదేశానికి చేసిన సేవ అందరికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దాసరి విశ్వనాధ్ వ్రాసిన మొదటినవల ‘ఫారో అండ్ ది కింగ్’ ని 2012 లో మెగాస్టార్ చిరంజీవి విడుదల చెయ్యగా, రెండో నవల 'ది విక్టోరియన్' బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ చేతులమీదుగా 2017లో ఆవిష్కృతమయ్యింది. ప్రస్తుతం విశ్వనాధ్ తన నాల్గో పుస్తకం (మూడో నవల) ను వ్రాసే పనిలో ఉన్నాడు. రచనలే కాకుండా, విశ్వనాధ్ ఫిల్మ్మేకింగ్ మరియు చిత్రకళానైపుణ్యంగలవాడు. కలర్ బ్లయిండ్నెస్స్ని అధిగమించి తాను నలభైకి పైగా పెయింటింగులు వేశారు. అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తియ్యాలనుకుంటున్నానని విశ్వనాధ్ అన్నారు. తన మూడో పుస్తకం నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి అమెజాన్ , నోషన్ ప్రెస్ మరియు ఫ్లిప్కార్క్ లో అందుబాట్లో ఉందన్నారు. పుస్తకావిష్కరణ రచయిత తల్లితండ్రులు దాసరి రాధాకృష్ణ , సత్య , ఇటీవలే తన రెండో పుస్తకాన్ని (Shivi and Her Will) రచించిన విశ్వనాధ్ సోదరి దాసరి సాయిజ, మీడియా ప్రతినిధుల మధ్య జరగగా, ఇన్ఫోసిస్ లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ వెత్సా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దేశం విషయంలో అందరూ ఒక్కటి కావాలి – ఉపరాష్ట్రపతి

• మనల్ని మనం తక్కువ చేసుకునే ధోరణిని విడనాడాలి • మన దేశ వైభవోపేతమైన వాస్తవ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది • విదేశీ దండయాత్రలు, బ్రిటిషర్ల విధానాతో…

న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌&డి) ప్రచురించిన పుస్తకాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ విడుదల చేశారు

మన పోలీసు బలగాల ముందు ఉద్భవిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వారి సామర్థ్యాన్ని పెంచేందుకు బిపిఆర్‌&డి కట్టుబడి ఉంది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2021-22 నుండి…

Banner

వేటపాలెం ‘సారస్వత నికేతన్‌’ లైబ్రరీ – వైఎస్ఆర్ ఆవార్డు ప్రదానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  , ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదానం చేశారు. విజయవాడ లోని…

సినీ ఆత్మీయుల సమక్షంలో ‘నిజంగా నేనేనా’ నవలా ఆవిష్కరణ

శ్రీను పాండ్రంకి నవలా రచయిత, సినీ దర్శకుడు. అతడు ఇంగ్లీష్ లో రాసిన క్రైమ్ మిస్టరీ నవల X² ఇది వరకే విడుదలయ్యి సక్సెస్  కాగా ఇప్పుడు తెలుగులో కొన్ని…