ఈ అద్బుతమైన పుస్తకం గురించి విన్నారా?

 కొన్ని పుస్తకాలు మన జీవితాలని మార్చేస్తాయంటే కొట్టి పారేస్తాం..పుస్తకాలకు అంత శక్తి ఉందంటే నమ్మం. కానీ ఆ పుస్తకాలను చదివి..ఇంకించికుని..అందులోని వాస్తవ సూత్రాలను జీవితంలోకి అప్లై చేసినవాళ్లకు తెలుస్తుంది వాటి విలువ. అటువంటి అరుదైన పుస్తకం ‘Vitamin G — Gratitude’. ప్రశాంత్ జైన్ రాసిన ఈ పుస్తకం ఇప్పుడు ఎందరి జీవితాల్లోనో ఊహించని మార్పులు తెస్తోంది.  మాజికల్ లైఫ్ ని ఆవిష్కరించటానికి ఉపకరించే  పుస్తకం అని అంటున్నారు. 
అసలు ఈ పుస్తకం టైటిల్  పెట్టడంలో చమత్కారం చూపించాడు రచయిత. మనందరం చిన్నప్పటి నుంచి విటమిన్స్, మినిరల్స్ ..వాటి వల్ల మన శరీరానికి ఒనగూరే ప్రయోజనం గురించి కుప్పలు తెప్పలుగా చదువుకుని ఉంటాం. అవి మన శరీర నిర్మాణానికి,పనితీరుకు పనికొచ్చేవి. కానీ ఎప్పుడూ విటమిన్ జి గురించి ఎక్కడా విని ఉండరు. ఈ విటిమన్ మన జీవితంలో అద్బుతాలను చేయటానికి మాత్రమే పనికివస్తుందంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, గ్రాటుట్యూడ్ కోచ్ అయిన ప్రశాంత్ జైన్ ఈ పుస్తకంలో గ్రాటుట్యూడ్ గొప్పతనం గురించి చెప్తారు. అది మనకు అందించే జీవితం గురించి మాట్లాడతారు.  ఈ పుస్తతం అద్బుతంగా సక్సెస్ అయ్యింది. ఈ రోజున యూత్ ఈ పుస్తకం చదవటానికి ఉత్సాహపడుతున్నారు. 
ఈ పుస్తకం రాయటానికి గల కారణం ఫేస్ బుక్ లోని ఓ సూసైడ్స్ క్యాంపైన్ ంటారు. ఆ క్యాంప్ లో మీరు ఎప్పుడైనా నిరాశ,నిస్పృహగా అనిపించినప్పుడు మా డోర్స్ కొట్టండి. అవి ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటాయి..మీ మాటలు వినటానికి  కొందరు సిద్దంగా ఉన్నారు అంటారు.  చాలా మంది ఎఫ్ బి యూజర్స్ దీన్ని స్టేటస్ గా పెట్టారు. అయితే నాకు అప్పుడు అనిపించింది..నిజంగా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు.. ఫేస్ బుక్ లోకి వచ్చి స్టేటస్ లు చూసే మానసిక స్దితిలో ఉండరు. నిజంగా ఫేస్ బుక్ స్టేటస్ లు చూసే స్దితిలో ఉంటే..వాళ్లు ఖచ్చితంగా నిబ్బరంగా ఉంటారు అనిపించింది.
ఈ ఆలోచనే నన్ను చాలా కాలం వేధించింది. అయితే ఓ సారి దీపిక పదుకోని తాను డిప్రెషన్ తో పోరాడిన విధానం తెలియ చేస్తూ మాట్లాడింది. అప్పుడు నాకు.. నా కథని ప్రపంచానికి చెప్పి కొందరికైనా ప్రేరణ కలిగించాలనిపించింది. గ్రాట్యుట్యూడ్ అనేది నా జీవితాన్ని ఎలా కష్టసమయంలో రక్షించిందో చెప్పాలనకున్నాను అదే ఈ పుస్తకం అన్నారు.   గ్రాటుట్యూడ్ అనేది జీవితానికి ఎంత అవసరమైన ఎలిమెంటో ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఈ పుస్తకం ఆరు పార్ట్ లుగా సాగుంది. మీరు ఈ పుస్తకం చదవండి..ఈ పుస్తకం దొరుకు చోటు..